ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 17 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలకలం రేపుతోంది.
అత్యధికంగా నెల్లూరులో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 46.1 డిగ్రీలు నమోదయ్యాయి. మార్కాపురంలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే తిరుపతిలో 45.6 డిగ్రీలు, పల్నాడులో 44.2 డిగ్రీలు, బాపట్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావడం తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఎండల ప్రభావంతో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news