భారతరత్న డా. బి. ఆర్. అంబేడ్కర్
135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని గుర్తు చేస్తూ, మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను కలగాపులగం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతకు మద్దతు ఉన్నప్పటికీ, దాని ముసుగులో ఇతర వర్గాలకు అన్యాయం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు.

అంబేడ్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, రాజ్యాధికారమే ఆయన అంతిమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. దళితులు, మేధావులు ఈ అంశంపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. సమాన ప్రతినిధిత్వం లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదని ఆయన అన్నారు.
విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని అంబేడ్కర్ విశ్వసించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఆ దిశగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Fetching videos...
Fetching latest news...
No trending news