బాలీవుడ్ స్టార్ Akshay Kumar చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. ఆయన నటిస్తున్న ‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్లో భోజ్‌పురి సంస్కృతి, పాటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో భోజ్‌పురి పాటను కూడా సినిమాలో చేర్చినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనిపై స్పందించిన అక్షయ్ కుమార్, “హాలీవుడ్ కంటే భోజ్‌పురి సంస్కృతి ఎంతో గొప్పది” అని వ్యాఖ్యానించారు. అలాగే మన దేశంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను గర్వంగా చూసుకోవాలని ఆయన సూచించారు. భోజ్‌పురి పాటల్లో ఉన్న ఎనర్జీ, ఫీల్‌ను హాలీవుడ్ ప్రేక్షకులు పూర్తిగా అర్థం చేసుకోలేరని కూడా చెప్పారు.
అదే ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నటుడు Paresh Rawal ‘హేరా ఫేరీ’ సిరీస్ గురించి క్లారిటీ ఇస్తూ, ఆ ఫ్రాంచైజ్ ఎప్పటికీ అదే స్టైల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు.
మొత్తానికి ఈ ఈవెంట్ తర్వాత అక్షయ్ వ్యాఖ్యలు ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. భోజ్‌పురి vs హాలీవుడ్ చర్చను మళ్లీ సోషల్ మీడియాలో హైలైట్ చేశాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news