ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తున్న సమయంలో కొందరు ఆటగాళ్లు చిరిగినట్లు కనిపించే సాక్సులు ధరించడం చాలామంది గమనించి ఉంటారు. ముఖ్యంగా అంతర్జాతీయ టోర్నీల్లో, ఫిఫా పోటీల్లో పలువురు స్టార్ ఫుట్బాలర్లు సాక్సుల్లో చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకుని ఆడుతుంటారు. అయితే ఇది ఫ్యాషన్ కోసం కాదు, శారీరక సౌకర్యం కోసం అనుసరిస్తున్న ప్రత్యేక పద్ధతి.
సాధారణంగా ఫుట్బాల్ ఆటగాళ్లు ధరించే కంప్రెషన్ సాక్సులు చాలా బిగుతుగా ఉంటాయి. దీంతో కాళ్ల వెనుక భాగంలోని పిక్క కండరాలపై అధిక ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు పరుగులు తీయాల్సి రావడం వల్ల ఆ ఒత్తిడి మరింత పెరిగి కండరాల నొప్పులు, బిగుతు సమస్యలు తలెత్తవచ్చు.
ఈ సమస్యను తగ్గించేందుకు ఆటగాళ్లు సాక్సుల్లో కొన్ని చోట్ల చిన్న రంధ్రాలు చేస్తారు. దీంతో కండరాలపై ఉండే ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మరింత సాఫీగా జరుగుతుంది. అలాగే కాళ్లలో బిగుతు తగ్గడంతో ఆటగాళ్లు స్వేచ్ఛగా కదలగలుగుతారు.
క్రీడా నిపుణుల ప్రకారం, ఈ పద్ధతి వల్ల కండరాల అలసట, క్రమ్ప్స్, గాయాల ప్రమాదం కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచ స్థాయి ఫుట్బాలర్లు సైతం సాక్సులను కత్తిరించి లేదా రంధ్రాలు పెట్టుకుని మైదానంలోకి దిగుతున్నారు. ఇటీవల ఫిఫా టోర్నీల్లో పలువురు స్టార్ ఆటగాళ్లు ఇదే విధానాన్ని అనుసరించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇది స్టైల్ కంటే ఆరోగ్యం, పనితీరును మెరుగుపరచే క్రీడా సాంకేతికతగా భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news