సూపర్ స్టార్ కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళులు
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కృష్ణ అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు.
తెలుగు సినిమాకు నూతన సాంకేతికతలను పరిచయం చేయడంలో, కొత్త తరహా చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంలో కృష్ణ విశేష పాత్ర పోషించారని చంద్రబాబు పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన మహానటుడు కృష్ణ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచారని సీఎం కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు కూడా కృష్ణను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news