పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళల సాధికారతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గ్రామ సంఘాల సహాయకులకు 5జీ స్మార్ట్ ఫోన్లు, రూ.24.50 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 21 మంది మహిళా లబ్ధిదారులకు ఈ సాయం అందింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు సాంకేతికతను అందిపుచ్చుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రభుత్వం మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసి మరింత మందికి ఆదర్శంగా నిలవాలని మహిళలను ప్రోత్సహించారు. మహిళలు కూడా ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వంపై నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నాయకులు, డీఆర్డీఏ అధికారులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news