విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు శంకుస్థాపన మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తు డిజిటల్ మార్గాన్ని నిర్దేశించే కీలక మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి నారా లోకేష్ పట్టుదల కారణంగానే విశాఖ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత, కూటమి ప్రభుత్వ సమిష్టి ప్రయత్నాలు కలిసి రాష్ట్రానికి ఈ స్థాయి పెట్టుబడులు తీసుకువచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 2026 ఏప్రిల్ 28 తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన తెలిపారు. 1997లో హైటెక్ సిటీతో ప్రారంభమైన ఐటీ విప్లవం ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో కొత్త దశలోకి ప్రవేశించిందని చెప్పారు. విశాఖ ఇకపై స్టీల్ సిటీ మాత్రమే కాకుండా గ్లోబల్ ఏఐ డేటా హబ్‌గా మారబోతోందని ఆయన స్పష్టం చేశారు.
గూగుల్ రాకతో విశాఖ పేరు ప్రపంచ ఐటీ మ్యాప్‌లో ప్రముఖంగా నిలుస్తుందని, “జి అంటే గూగుల్” అనే స్థాయికి నగరం ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు అవుతున్న ఈ ప్రాజెక్ట్ దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలబెడుతుందని చెప్పారు.
తుర్లవాడ ప్రాంతం భవిష్యత్తులో టెక్నాలజీ హబ్‌గా మారుతుందని, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందుతుందని ఆయన తెలిపారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు దూరదృష్టికి అంతర్జాతీయ గుర్తింపు అని పల్లా పేర్కొన్నారు.
లోకేష్ గూగుల్ క్యాంపస్‌కు వెళ్లి పెట్టుబడులు తీసుకురావడంలో చూపిన చొరవ అసాధారణమని ఆయన కొనియాడారు. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా మారిందని తెలిపారు.
వైసీపీ నేతల విమర్శలను ఆయన ఖండిస్తూ, గత పాలనలో పెట్టుబడులు తగ్గిపోయిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేరని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు.
భోగాపురం విమానాశ్రయం, దక్షిణ కోస్తా రైల్వే జోన్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, అనకాపల్లి అభివృద్ధి వంటి అంశాలు ఉత్తరాంధ్రను దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మార్చనున్నాయని ఆయన చెప్పారు.
గూగుల్, అదానీ, ఎయిర్టెల్ వంటి సంస్థల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా ఎదుగుతోందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక మలుపు అని ఆయన స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news