భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా విజయోత్సవ మహాసభ నిర్వహించనున్నారు.
ఈ మహాసభలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై వివరాలు తెలియజేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పార్టీ నాయకులు, పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు.
పార్టీలకు అతీతంగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ విజయోత్సవ మహాసభను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం కూటమి ఐక్యతను ప్రతిబింబించే వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news