ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని 62, 63వ డివిజన్ల క్లస్టర్ ఇంచార్జి బత్తుల కొండా సూచించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాల మేరకు ఆదివారం బూత్ ఇంచార్జిలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఓటర్ సర్వే, వెరిఫికేషన్ ప్రక్రియపై వివరంగా చర్చించారు. ప్రతి ఇంటికి బూత్ లెవల్ అధికారి వెళ్లే సమయంలో టీడీపీ బూత్ ఇంచార్జిలు కూడా తోడుగా ఉండాలని ఆయన సూచించారు. ఓటర్ జాబితా సరిచేయడంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఓటర్ లిస్టు సవరణ ప్రక్రియలో పూర్తిగా పారదర్శకత పాటించాలని బత్తుల కొండా స్పష్టం చేశారు. ప్రజల హక్కులకు భంగం కలగకుండా అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో పలువురు బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news