తమిళనాడులో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం కావడంతో, నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గవర్నర్ ఆర్.ఎన్. రవీంద్ర నాథ్ ఆర్లేకర్ విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
టీవీకే పార్టీకి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పలు పార్టీల మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ బలం 120 ఎమ్మెల్యేల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఈ మద్దతుతో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీ సాధించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. స్టేడియం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది.
మొత్తంగా చూస్తే తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమవుతోందని, విజయ్ నాయకత్వంలో టీవీకే ప్రభుత్వం కొత్త దిశలో పాలన ప్రారంభించబోతుందని భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news