తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాల మధ్య ఈరోజు రాష్ట్ర శాసనసభ సమావేశం కానుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా విజయ్ అసెంబ్లీలో సీఎం సీట్లో కూర్చోనున్నారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
అలాగే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో విజయ్ తొలి ప్రసంగం, ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఆయన చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న ఈ సమావేశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news