తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మళ్లీ సందిగ్ధంలో పడింది.
అంతా సవ్యంగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) మద్దతు ఉపసంహరించుకోవడం కీలక మలుపుగా మారింది. అదే సమయంలో వీసీకే అధికారిక మద్దతు లేఖ ఇవ్వకపోవడం టీవీకే శిబిరంలో ఆందోళన పెంచుతోంది.
ఈ పరిణామాలతో విజయ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు తగ్గినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రాజ్‌భవన్ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఉత్కంఠను మరింత పెంచుతోంది.
ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ సీఎం అవుతారని ఆశగా ఎదురుచూసిన అభిమానులు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. సోషల్ మీడియాలో “పాపం విజయ్” అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. రాజకీయ చదరంగంలో విజయ్‌కు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయని చర్చ సాగుతోంది.
మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం తమిళనాడులో ఇంకా అనేక సమీకరణాలు మారే అవకాశముందని భావిస్తున్నారు. మద్దతు పార్టీలతో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో పరిస్థితులు మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
మొత్తంగా తమిళ రాజకీయాల్లో సీఎం కుర్చీకి అడుగు దూరంలో నిలిచిన విజయ్‌కు ఇప్పుడు ప్రతి క్షణం కీలకంగా మారింది. ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందన్నదానిపై అభిమానులు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news