2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో కొత్త వివాదానికి దారితీశాయి. ప్రపంచకప్ నుంచి ఇరాన్ జట్టు నిష్క్రమించిన తర్వాత తాను "సంతోషంతో డ్యాన్స్ చేశానని" ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఇరాన్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో తమకు సంతోషంగా అనిపించిందని, వారు ఇక అమెరికాకు తిరిగి రాకపోవడం ఆనందంగా ఉందని ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్రంగా స్పందిస్తూ అమెరికా అధికారులపై విమర్శలు గుప్పించింది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మాట్లాడుతూ, ఇరాన్ ప్రతినిధి బృందంతో వ్యవహరించడం టోర్నమెంట్లో అత్యంత క్లిష్టమైన అంశమైందని చెప్పారు. ఇరాన్ జట్టు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగానే వారి వీసాలను రద్దు చేసి అమెరికా భూభాగం విడిచి వెళ్లేలా చేసినప్పుడు తాను ఎంతో సంతోషించానని, ఆ ఆనందంలో పాట కూడా పాడానని, డ్యాన్స్ కూడా చేశానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, క్రీడా వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి
ఇరాన్ ప్రపంచకప్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ డ్రా సాధించింది. అయినప్పటికీ గోల్ తేడా కారణంగా నాకౌట్ దశకు అర్హత సాధించలేక టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. చివరి ఉత్తమ మూడో స్థాన జట్ల ఎంపికలో ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఇరాన్‌కు అనుకూలంగా రాకపోవడంతో వారి ప్రపంచకప్ ప్రయాణం అక్కడితో ముగిసింది. ఈ నేపథ్యంలో అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి
Fetching videos...
Fetching latest news...
No trending news