శ్రీకాళహస్తిలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్రావు పాల్గొన్నారు. బూత్ కన్వీనర్ గాజుల భగత్ ఆధ్వర్యంలో నాయకులు ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా డా. ఉమేష్రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత సాధించిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు.
దీపం–2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు శ్రీకారం చుట్టడం వంటి నిర్ణయాలు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, కాసరం రమేష్, లక్కమనేని మధుబాబు, వజ్రం కిషోర్, గాదిపాకుల గోపీనాథ్, షేక్ మహబూబ్ బాషా, కోట చంద్రశేఖర్, సయ్యద్ చాంద్ బాషా, పూల శేఖర్, నూర్ మొహమ్మద్, గాజుల భగత్, గగన్ యాదవ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news