తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ కోటాలో సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ప్రముఖ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. భక్తులు అధికారిక తితిదే వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
సేవా టికెట్ల కోసం లక్కీడిప్ విధానంలో ఎంపిక చేపట్టనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం లక్కీడిప్ ద్వారా ఎంపికైన భక్తులకు టికెట్లు కేటాయించనున్నారు.
లక్కీడిప్‌లో ఎంపికైన వారు ఈ నెల 20 నుంచి 22 మధ్యాహ్నం లోపు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు పూర్తైన తర్వాత మాత్రమే సేవా టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే స్పష్టం చేసింది.
భక్తులు ముందుగానే తమ వివరాలు సిద్ధం చేసుకుని, సమయానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆర్జిత సేవా టికెట్లకు ఎప్పటిలాగే భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news