తిరుపతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు, అభ్యుదయవాదులు మరియు అంబేద్కర్ అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీసీ నాయకుడు జగన్నాథం మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనని, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ సూత్రాలే దేశానికి మార్గదర్శకమని అన్నారు. కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, న్యాయం, అవకాశాలు అందరికీ చేరేలా ఆయన కలలు నెరవేర్చడమే నిజమైన నివాళి అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జగన్నాథం, మిత్ర బృందం పాకాల కృష్ణమూర్తి, ఎస్సీ నాయకులు తాళ్లపాక దాము మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news