తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పోలిస్తే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత, వాహనాల రాకపోకలు, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అధికారులు సమీక్షించారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా పోలీసు శాఖతో కలిసి చర్యలు చేపట్టాలని, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news