తెలంగాణలో పాఠశాలలు రేపటి నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ముందుగా ఈ నెల 12 వరకు సమ్మర్ సెలవులు నిర్ణయించగా, ఎండల తీవ్రత కారణంగా ప్రభుత్వం వాటిని ఇవాళ్టి వరకు పొడిగించింది. దీంతో రేపటి నుంచి విద్యార్థులు తిరిగి బడులకు హాజరుకానున్నారు.
అయితే పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల్లో కొంత సందేహం నెలకొంది. సోమవారం అమావాస్య కావడంతో కొందరు పేరెంట్స్ పిల్లలను రేపు స్కూల్కు పంపడంపై సంకోచం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతిష్య, ముహూర్త విశ్వాసాల కారణంగా కొంతమంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
అదేవిధంగా మంగళవారం రోజు మంచిరోజు కాదని భావిస్తూ మరికొందరు తల్లిదండ్రులు పిల్లలను బుధవారం నుంచి మాత్రమే స్కూల్కు పంపాలని ఆలోచిస్తున్నారు. దీంతో స్కూళ్ల రీఓపెనింగ్ రోజు హాజరుపై భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అయితే పాఠశాలలు రేపటి నుంచే యథావిధిగా ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశం తల్లిదండ్రుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news