తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఇసుక, గ్రానైట్ వ్యాపారులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్లు సమాచారం.
మొత్తం 8 ప్రాంతాల్లో నాలుగు కంపెనీలకు సంబంధించిన ఆస్తులు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
పలు కంపెనీలు GST ఎగ్గొట్టి కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, రికార్డులు, బిల్లులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై అధికారులు లోతైన పరిశీలన చేస్తున్నారు.
ఇసుక, గ్రానైట్ వ్యాపార రంగంలో పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలు జరిగాయా అనే కోణంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. అనుమానాస్పద సంస్థలపై మరిన్ని సోదాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
మొత్తానికి తెలంగాణలో ఈడీ దాడులు మళ్లీ వేగం పుంజుకోవడంతో వ్యాపార వర్గాల్లో కలకలం నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news