కడప జిల్లాలో టీనేజ్ గర్భధారణలను తగ్గించేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఐసిడిఎస్ సిడిపిఓ శోభారాణి స్పష్టం చేశారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించి, చిన్న వయసులో గర్భధారణ వల్ల అమ్మాయిల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు.
పాఠశాల స్థాయి నుంచే లైంగిక ఆరోగ్యంపై సరైన అవగాహన కల్పించడం, బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించడం కీలకమని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాల ద్వారా ప్రజలకు టీనేజ్ గర్భధారణ ప్రమాదాలను వివరించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఎంపీడీవో ఫణి రాజకుమారి మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. లీగల్ కౌన్సిలర్ మహేష్ చైల్డ్ మ్యారేజ్ వల్ల పిల్లలు తమ హక్కులను కోల్పోతారని హెచ్చరించారు. జేజే చట్టం, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం వంటి నిబంధనలను అమలు చేయడం ద్వారా పిల్లల రక్షణ సాధ్యమని వివరించారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నరసమ్మ టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news