కర్నూలు నగరంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి” కార్యక్రమంలో భాగంగా 55వ బూత్ పరిధిలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ గత రెండేళ్లలో సాధించిన పురోగతిని వివరించారు.
మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్రానికి తీసుకొచ్చిన పారిశ్రామిక పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను తెలియజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి. హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు, విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 55వ బూత్ ఇన్ఛార్జ్ కె. ఏసన్న, బూత్ ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు సురేష్‌బాబు, అన్వర్ భాషతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news