ట్రామా కేర్ సేవలను ఇకపై ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రమాదాల సమయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, ఆలస్యమైన వైద్యం ప్రాణాలకే ముప్పుగా మారుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడు నెలల్లోగా 112 అత్యవసర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనే అసలైన వైద్యం అని కోర్టు వ్యాఖ్యానించింది.
రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే వారికి ఎలాంటి చట్టపరమైన భయం ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహాయక చర్యలు చేపట్టే వారిపై పోలీసుల వేధింపులు జరగకూడదని కూడా ధర్మాసనం పేర్కొంది.
ఆసుపత్రుల బాధ్యతను గుర్తుచేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని కోర్టు హైలైట్ చేసింది. ప్రజల ప్రాణరక్షణే ప్రధాన లక్ష్యంగా వ్యవస్థ పనిచేయాలని సూచించింది.
ఈ తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవల వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news