రుద్రంపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి రూపేష్ పాసి (36) దుర్మరణం చెందాడు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో నివసించే రూపేష్ పాసి సత్తుపల్లి కిష్టారం ఓపెన్ కాస్ట్లో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి. ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం, రూపేష్ పాసి రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా చండ్రుగొండ నుండి కొత్తగూడెం వైపు వేగంగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదానికి కారణమైన కారు నంబర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రుద్రంపూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news