శివపురం : ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం కింద రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను శివపురం గ్రామంలో ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు పూర్తికావడంతో స్థానిక ప్రజలతో కలిసి రోడ్లను ప్రారంభించడం జరిగింది.
అదే సమయంలో గ్రామంలో త్రాగునీటి అవసరాల కోసం వేసిన బోరు ద్వారా సమృద్ధిగా నీరు లభించడంతో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన శీర్పి అశోక్ గారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా గ్రామ అభివృద్ధి పనుల్లో భాగంగా సహకరించిన అధికారులను సన్మానించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్డు సదుపాయాల మెరుగుదలపై మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news