గాదె సాయికృష్ణ కస్టడీ మృతి కేసుపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల విచారణపై స్టే విధించాలన్న అంశంతో పాటు, ఆ కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న అభ్యర్థనపై కూడా విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
హైకోర్టులో సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పిటిషన్లు, ఇతర కేసుల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే విచారణ పూర్తయి తీర్పు దశకు చేరుకున్న కేసుల వివరాలను కూడా తమ ముందు ఉంచాలని పిటిషనర్లు, ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిశీలించిన అనంతరం కేసులపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హైకోర్టులో కొనసాగుతున్న విచారణల స్థితిగతులు, తీర్పు దశలో ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో సాయికృష్ణ కేసులో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. రేపు జరిగే విచారణలో సమర్పించే వివరాల ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news