తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు డా. పూరిమిట్ల కుమారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మీ గారికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తనపై నమ్మకముంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పట్ల గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్న ఆమె, పార్టీ తనకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్తిగా అంకితభావంతో సేవలందిస్తానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పని చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తానని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తనకు గుర్తింపు ఇచ్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వ దిశానిర్దేశం ప్రకారం పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఈ అవకాశం తన రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపు అని పేర్కొన్నారు.
డా. పూరిమిట్ల కుమారి ప్రస్తుతం ఏపీ స్టేట్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కొత్త బాధ్యతలతో మరింత బాధ్యతగా పనిచేస్తానని ఆమె వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news