ప్రపంచానికి పరిష్కారాలను అందించే దేశంగా భారత్ త్వరలో అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత యువత ఆవిష్కరణలతో మానవాళికి మేలు చేసే దిశగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుతం స్టార్టప్ విప్లవం కొనసాగుతోందని, యువత సృజనాత్మకత ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత యువత నైపుణ్యాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ వేదిక ద్వారా భారత స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలకు అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణల ద్వారా దేశాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక భారత్–ఫ్రాన్స్ సంబంధాలు ప్రత్యేకమైనవని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య విజన్, ఇన్నోవేషన్, ఇన్స్పిరేషన్ అనే మూడు అంశాలు బలమైన బంధాన్ని నిర్మిస్తున్నాయని ఆయన అన్నారు. రక్షణ, సాంకేతికత, అంతరిక్ష రంగాల్లో సహకారం మరింత బలోపేతం అవుతోందని ఆయన పేర్కొన్నారు.
భారత యువత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ద్వారా భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news