నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర విజన్ 2047’ కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య, ఆర్డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్‌తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ పదార్థాలు సంవత్సరాల తరబడి కరగకుండా ప్రకృతిలో మిగిలి మానవజాతికి, వన్యప్రాణులకు, సముద్ర జీవరాశికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన సూచించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. మనం తీసుకునే చర్యలు రాబోయే తరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించాలని ఆయన అన్నారు. పరిశుభ్రతపై చూపే శ్రద్ధ భవిష్యత్ తరాలకు మంచి జీవన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికారులతో కలిసి స్వచ్ఛతపై ప్రమాణం చేయడం జరిగింది. మార్కెట్లో ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ హితమైన బ్యాగులను పంపిణీ చేశారు. ప్రజలు స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించడంలో చీరాల నియోజకవర్గ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మాలకొండయ్య కోరారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news