పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గతంలో నిర్మాణం నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడంతో పాటు అర్హులైన కుటుంబాలకు ఇళ్లను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా త్రీడీ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
పేద కుటుంబాలకు నాణ్యమైన ఇళ్లు అందించడంతో పాటు నిర్మాణ వ్యయం, సమయం తగ్గించేలా కొత్త విధానాలను అమలు చేస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. గత ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిన గృహ నిర్మాణ కార్యక్రమాలతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం అర్హులైన కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news