హైదరాబాద్‌లో ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల నడి రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో కనిపించిన ఘటన కలకలం రేపింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె నిన్న రాత్రి చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే వైద్యానికి అవసరమైన డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో అర్థరాత్రి సమయంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను వై జంక్షన్ సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద దింపి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పావలా శ్యామల ఫుట్‌పాత్‌పై ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను సురక్షితంగా అక్కడి నుండి తరలించారు. అనంతరం ఆమెను ఆర్కే ఫౌండేషన్‌కు పంపించి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందకపోవడం, అలాగే రాత్రి వేళ ఫుట్‌పాత్‌పై వదిలివేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news