మలయాళ నటి పార్వతి తిరువోతు తనకు ఎదురైన అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ముక్కుసూటి వైఖరి కారణంగా ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. మహిళలు, ఆర్టిస్టుల హక్కులపై ప్రశ్నించినందుకు తనకు తీవ్ర బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.
కొంతమంది తనను రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరించినట్లు పార్వతి తిరువోతు ఆరోపించారు. ఈ పరిణామాల కారణంగా కొన్ని పెద్ద సినిమాలను కూడా కోల్పోయానని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ తన కుటుంబం, స్నేహితులు ఆ సమయంలో తనకు అండగా నిలిచారని తెలిపారు.
ఇండస్ట్రీలో మహిళల భద్రత, గౌరవం అంశాలపై మాట్లాడటం ఎంత కష్టమో ఈ అనుభవం ద్వారా తెలిసిందని ఆమె అన్నారు. ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల ఎదురైన ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నానని చెప్పారు.
ఇటీవల ఆమె ‘తంగలాన్’ చిత్రంలో నటించగా, తెలుగులో ‘దూత’ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news