స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి స్వయంగా పాల్గొని ఆదర్శంగా నిలిచారు. బెలగాం అగ్రహారం వీధి కోనేరు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగడంతో అధికారులు, సిబ్బందిలో కొత్త ఉత్సాహం నెలకొంది. అనంతరం కోనేరు మెట్లను కూడా శుభ్రం చేయించి నీటి వనరుల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా చారిత్రక ప్రాధాన్యత ఉన్న కోనేరులు, చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. జలధార–జల హారతి కార్యక్రమం నీటి వనరుల పునరుద్ధరణకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
పరిసరాలను ఒక రోజు మాత్రమే శుభ్రం చేయడం కాకుండా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రజలపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు, భక్తులు కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ డి. పావని, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news