పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం క్రోసూరు వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. నదిలో పడవ బోల్తాపడటంతో నలుగురు వ్యక్తులు గల్లంతైన ఘటన కలకలం రేపింది. బంధువుల ఫంక్షన్కు హాజరై కోనూరు ప్రాంతానికి వచ్చిన కొందరు వ్యక్తులు చిన్న బోట్లో విహార యాత్రకు వెళ్లినట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అందిన వివరాల ప్రకారం మొత్తం పది మంది బోటులో ప్రయాణించగా, ప్రయాణం మధ్యలో పడవ అదుపుతప్పి బోల్తాపడింది. నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురిని స్థానికులు వెంటనే కాపాడినట్లు తెలుస్తోంది. అయితే మరో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటనతో క్రోసూరు ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news