విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పి-4 కార్యక్రమం ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించే చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సహకారంతో టీడీపీ యువనేత బొండా సిద్ధార్థ తన సొంత నిధులతో ఇద్దరు మహిళలకు ఉపాధి సాధనాలను అందజేశారు.
సింగ్‌నగర్‌కు చెందిన ప్రియాంక ఇటీవల టైలరింగ్ శిక్షణ పూర్తి చేసి స్వయం ఉపాధి పొందాలని సంకల్పించారు. అయితే కుట్టు మిషన్ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సహాయం కోరగా, ఆమెకు కుట్టు మిషన్‌కు అవసరమైన అన్ని పరికరాలను బొండా సిద్ధార్థ అందజేశారు.
అదేవిధంగా పాయకాపురానికి చెందిన శివపార్వతి జీవనోపాధి కోసం తోపుడు బండి కావాలని విజ్ఞప్తి చేయగా, పి-4 కార్యక్రమం ద్వారా ఆమెకు తోపుడు బండిని అందించారు. దీంతో ఇద్దరు మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి అవకాశం కలిగింది.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. నైపుణ్యం ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పి-4 కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక మంది పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, విద్యా, వైద్య సహాయం వంటి పలు రూపాల్లో చేయూత అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news