పాలకొండ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కొనియాడారు. మంగళవారం ఎం. రాజీపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక న్యాయానికి ప్రతీకగా, సమానత్వ సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువల కోసం ఆయన జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు హక్కులు, సమాన అవకాశాలు కల్పించి భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలిపిందని తెలిపారు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో తోటపల్లి ప్రాజెక్టు మాజీ చైర్మన్ నిమ్మక పాండురంగ, కర్నేన అప్పాల నాయుడు, గర్భాన సత్తిబాబు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news