టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తన ఆరో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్య ఒర్మాకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఆయన, భార్య-కుమారుడితో కలిసి ఉన్న అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ చంద్ర మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమాల కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకోవడం వల్ల. శుక్రవారం (జూన్ 12) తన ఆరో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న నవీన్ చంద్ర, సోషల్ మీడియా వేదికగా భార్య ఒర్మాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తన కుటుంబానికి సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోల్లో నవీన్ చంద్ర భార్య ఒర్మా, కుమారుడు ఎంతో క్యూట్‌గా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన నవీన్ చంద్ర, ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకున్న ఆయన, తర్వాత దళం, భమ్ భోలేనాథ్, త్రిపుర, లక్ష్మీదేవికి ఓ లక్కుంది, మీలో ఎవడు కోటీశ్వరుడు, భానుమతి రామకృష్ణ, మంత్ ఆఫ్ మధు, బ్లైండ్ స్పాట్, లెవెన్ వంటి పలు చిత్రాల్లో నటించారు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ జానర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు నవీన్ చంద్ర. హీరో పాత్రలతో పాటు విలన్‌గా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ, నేను లోకల్, ఎవరు, విరాట పర్వం, జిగర్తాండ డబుల్ ఎక్స్, మాస్ జాతర వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.
వ్యక్తిగత జీవితానికి వస్తే, నవీన్ చంద్ర-ఒర్మాలది ప్రేమ వివాహం. ఆసక్తికర విషయం ఏమిటంటే ఒర్మాకు కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. ఆమె గతంలో మలయాళ సినీ పరిశ్రమలో డైరెక్షన్ విభాగంలో పని చేశారు.
ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నవీన్ చంద్ర షేర్ చేసిన కుటుంబ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నవీన్ చంద్ర కుటుంబానికి సంబంధించిన ఈ అరుదైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news