రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని తీసుకురావడంపై లోకేష్‌కు తెలుగువారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్న తీరు పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, “ప్రవాసాంధ్రులంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి” అని పిలుపునిచ్చారు. మీరు పనిచేస్తున్న కంపెనీలు, వ్యాపార వర్గాల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడుల గురించి చర్చించాలని కోరారు.
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంలో ప్రవాస భారతీయుల సహకారం కీలకమని మంత్రి పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా పలువురు పరిశ్రమల ప్రతినిధులు, సంస్థలతో మంత్రి లోకేష్ సమావేశాలు నిర్వహించనున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news