తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 14, 15 తేదీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు.
మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్లపై అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ విభాగాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
14వ తేదీ సాయంత్రం అనంతపురానికి చేరుకోనున్న మంత్రి లోకేష్, ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పొందిన ఆర్డీటీ సంస్థ నిర్వాహకులు మంచో ఫెర్రర్, అన్నే ఫెర్రర్‌లను కలవనున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా పరిశీలించారు. విజయవాడ నుంచి వచ్చిన మంత్రి లోకేష్ బృందంతో కలిసి శ్రీనగర్ కాలనీలోని గల్లా టౌన్షిప్ మైదానాన్ని సందర్శించి, సభా ఏర్పాట్లు, హాజరు కానున్న కార్యకర్తల సంఖ్య, అవసరమైన సౌకర్యాలపై చర్చించారు.
మంత్రి లోకేష్ పర్యటన పార్టీకి మరింత ఉత్సాహాన్ని తీసుకువస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి పేర్కొన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త చొరవ తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, సంఘ తేజస్విని, నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news