నంద్యాలలో పేదలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించేందుకు జన ఔషధీ మెడికల్ స్టోర్ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ స్టోర్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యాన్ని అధికారులు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచి సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు.

జిల్లాలో ఇప్పటికే ఆరోగ్య సేవలను విస్తరించే చర్యల్లో భాగంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్, “మీ ఇంటికి మీ డాక్టర్” వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు జన ఔషధీ కేంద్రం ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కేంద్రం ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ, రాంకో, రేన్ సిమెంట్ సంస్థలు, ఇతర దాతలు ఆర్థిక సహాయం అందించగా, కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news