నెల్లూరు జిల్లా ఆత్మకూరు టౌన్ ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో “40 డేస్ గో టు విలేజ్” కార్యక్రమం భాగంగా టౌన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ హాజరై మాట్లాడారు.
మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలు జరగాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు టౌన్లో కూడా జెండా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
యువత విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు పూర్తిగా అందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందని సూచించారు.
మాదిగ సమాజానికి ఏ సమస్య వచ్చినా ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని మాదిగ యువత గ్రామ స్థాయి నుంచి కమిటీల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. టౌన్ స్థాయిలో కొత్త కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news