శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో జరగనున్న శ్రీ ముక్తేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని గ్రామ పెద్దలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహోత్సవాల ప్రచార కరపత్రాన్ని కూడా ఆవిష్కరించారు.
ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భోజనం గ్రామంలో శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ధ్వజ ప్రతిష్ట, పరివార సమేత శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ గ్రామ ప్రతినిధులు శనివారం నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ బైరెడ్డి శబరికి ప్రత్యేక ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మహోత్సవాల వివరాలను ఆమెకు వివరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భోజనం గ్రామ పెద్దలు ఎం. మనోహర్ రెడ్డి, సి. వెంకటేశ్వర్లు, నందకుమార్ యాదవ్, వడ్డె సురేంద్ర, వడ్డె కేదారనాథ్, బి. నాగేశ్వరావు, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో జరిగే ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news