ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం భారీ మార్పుకు లోనైంది. పూనావాలా పార్టనర్షిప్తో కలిసి మిట్టల్ కుటుంబం ఈ జట్టును దాదాపు రూ.15,660 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఒప్పందంతో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ జట్టు యాజమాన్య నిర్మాణం పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది.
ఈ డీల్ ప్రకారం మిట్టల్ కుటుంబం 75 శాతం వాటాను కలిగి ఉండగా, పూనావాలా గ్రూప్ 18 శాతం వాటాను పొందనుంది. ప్రస్తుత యజమాని మనోజ్ బదాలే 7 శాతం వాటాను కొనసాగించనున్నారు. ఈ ఒప్పందంలో కేవలం ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా, ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన గ్లోబల్ క్రికెట్ జట్లు కూడా భాగమయ్యే అవకాశం ఉందని సమాచారం.
మూడో త్రైమాసికం నాటికి ఈ ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలు, బోర్డు అనుమతులు పూర్తయిన తర్వాత అధికారికంగా యాజమాన్య మార్పు ప్రకటించనున్నారు.
ఇంతకుముందు ఎం ఏ ఆర్ సంస్థ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేయడానికి కల్ సోమాని ప్రయత్నించినప్పటికీ, ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. ఇప్పుడు మిట్టల్–పూనావాలా భాగస్వామ్యంతో ఈ డీల్ విజయవంతమైన దశకు చేరుకుంది.
క్రికెట్ వర్గాల్లో ఈ యాజమాన్య మార్పు పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ పెట్టుబడులు, గ్లోబల్ విస్తరణ ప్రణాళికలతో రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్ వ్యూహాలు మరింత బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంగా మిట్టల్ కుటుంబం చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్ రావడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news