ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక సహకారం ఆకర్షించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఉదయం ఎంటీఐ కార్యాలయంలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
మధ్యాహ్నం కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో, సీఎఫ్‌వోలతో లోకేష్ భేటీ కానున్నారు. అనంతరం ప్రముఖ డీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
సింగపూర్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news