ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ‘ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సూచించారు.
ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వారి అవసరాలను తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ఉద్యోగులు, అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. వినతుల స్వీకరణకే పరిమితం కాకుండా, వాటిపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నట్లు కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యల కోసం పదేపదే కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, విజయనగరం, బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ అధికారులు సుధాసాగర్, రామ్మోహన్రావుతో పాటు వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖలు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news