స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సాలూరు మున్సిపల్ పార్కులో శనివారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలను స్వయంగా తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పార్క్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. పార్క్ చుట్టూ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆధునిక పరికరాలతో జిమ్‌ను అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
మున్సిపల్ కార్యాలయంలో ఉపయోగంలో లేని జిమ్ సామగ్రిని పార్క్‌లో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. పార్క్‌ను ఆరోగ్యకరమైన వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని, యువతతో పాటు వృద్ధులకు కూడా అనుకూలంగా సదుపాయాలు కల్పించాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news