ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల ఫోటోలు, కంటెంట్ ఆధారంగా కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో కొత్త చిత్రాలను రూపొందించే ఫీచర్‌ను తీవ్ర విమర్శల నేపథ్యంలో మెటా ఉపసంహరించుకుంది. గోప్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో పాటు వినియోగదారుల అనుమతి లేకుండానే వారి చిత్రాలను AI శిక్షణకు, కొత్త చిత్రాల తయారీకి ఉపయోగించే అవకాశం కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తమ కొత్త ఫీచర్ ప్రజల అంచనాలకు అనుగుణంగా లేదని అంగీకరించిన మెటా, దానిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మెటా ఇటీవల ‘మ్యూస్ ఇమేజ్’ పేరుతో కొత్త AI ఇమేజ్ జనరేషన్ సాధనాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మెటా AI చాట్‌బాట్‌ను ఉపయోగించే వారు ఇన్‌స్టాగ్రామ్‌లోని పబ్లిక్ ఖాతాలను ట్యాగ్ చేసి, ఆ ఖాతాల్లోని చిత్రాలు లేదా కంటెంట్ ఆధారంగా కొత్త AI చిత్రాలను సృష్టించగలిగే విధంగా సౌకర్యం కల్పించారు. ఇప్పటికే ఉన్న ఫోటోలను మార్చడం, కొత్త రూపాల్లో రూపొందించడం కూడా ఈ ఫీచర్ ద్వారా సాధ్యమైంది.
అయితే ఈ ఫీచర్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కలిగిన వినియోగదారులు తమ అనుమతి లేకుండానే AI చిత్రాల కోసం ఉపయోగించబడుతున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులను ముందస్తుగా ఈ ఫీచర్లో భాగస్వాములను చేసిన విధానం కూడా వివాదానికి దారితీసింది. ఫీచర్లో డిఫాల్ట్‌గా వినియోగదారులను చేర్చడం గోప్యతకు విరుద్ధమని అనేక మంది అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news