ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా, స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు చోటు కల్పించకపోవడం పెద్ద షాక్‌గా మారింది. మొత్తం 21 మంది ఆటగాళ్లతో రూపొందించిన ఈ జాబితాలో ఆయనను ఎంపిక చేయలేదు.
రాబోయే 12 నెలల్లో ఆస్ట్రేలియా జట్టు సుమారు 20 టెస్టు మ్యాచ్‌లు ఆడనుండటంతో, టెస్ట్ స్పెషలిస్టులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల మ్యాక్స్‌వెల్ కెరీర్ ఈ నిర్ణయంతో చివరి దశకు చేరినట్లు భావిస్తున్నారు.
అలాగే యువ ఆటగాడు సామ్ కోన్స్టాస్ కూడా ఈ 21 మంది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ కాంట్రాక్ట్ ఎంపికలో అనుభవం, టెస్ట్ ఫార్మాట్ ప్రాధాన్యం ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news