కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్‌పై నటి మాళవిక మోహనన్ తాజాగా ప్రశంసలు కురిపించారు. విజయ్‌తో కలిసి ‘మాస్టర్’ సినిమాలో నటించిన అనుభవాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన ప్రవర్తన, క్రమశిక్షణ, పని తీరును దగ్గరగా గమనించే అవకాశం లభించిందని తెలిపారు. మొదటి రోజు షూటింగ్‌లోనే చాలా కష్టమైన సీన్ చేయాల్సి వచ్చిందని, తాను తన డైలాగ్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టగా, విజయ్ మాత్రం ఎంతో ప్రశాంతంగా, ఫోకస్‌తో పని చేస్తారని చెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన సమతుల్యంగా ఉండడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని ఆమె పేర్కొన్నారు.
విజయ్ ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ అందరితో స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండే వ్యక్తి అని మాళవిక చెప్పారు. అవసరం వచ్చినప్పుడు నేరుగా ఫోన్ చేయగలిగే స్వేచ్ఛ ఇవ్వడం ఆయనలోని వినమ్రతను చూపిస్తుందని తెలిపారు. షూటింగ్లో ఆయన పని పట్ల చూపించే శ్రద్ధ, ప్రతి విషయాన్ని గమనించే తీరు తనపై ఎంతో ప్రభావం చూపిందని ఆమె అన్నారు.
మోహన్‌లాల్, రజనీకాంత్, విజయ్ వంటి సీనియర్ నటులతో పని చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చని మాళవిక అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సమయపాలన విషయంలో వీరు ఎంతో కచ్చితంగా ఉంటారని చెప్పారు. ఉదయం 7 గంటలకు కాల్షీట్ ఉంటే 6:55కే సెట్స్‌లో ఉండే అలవాటు వీరిదని, ఈ క్రమశిక్షణ వల్ల నిర్మాతలకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని వివరించారు.
అలాగే ‘మాస్టర్’ సినిమాలో విజయ్‌తో కలిసి డ్యాన్స్ చేయలేకపోయానని ఇప్పటికీ సరదాగా ఆయనతో చెబుతుంటానని మాళవిక నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. మొత్తంగా విజయ్ వ్యక్తిత్వం, ప్రొఫెషనలిజం తనకు ఎంతో నేర్పిందని ఆమె అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news