రామకుప్పం రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ యానాది కాలనీ, గుడ్డూరు అటవీ ప్రాంతాల్లో కుప్పం రూరల్ పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కుప్పం సబ్-డివిజన్ ASP శ్రీ హేమంత్ బొడ్డు, IPS గారి పర్యవేక్షణలో అక్రమ మద్యం తయారీ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా కుప్పం రూరల్ సీఐ శ్రీ మల్లేష్ యాదవ్, రాళ్లబూదుగూరు ఎస్ఐ శ్రీ నరేష్, రామకుప్పం ఎస్ఐ శ్రీ మరెప్ప మరియు పోలీసు సిబ్బంది కలిసి రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని యానాది కాలనీ, గుడ్డూరు అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా, సుమారు *5,000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.* అదేవిధంగా, రౌడీషీటర్లను తనిఖీ చేసి, వారి ప్రస్తుత కదలికలు, కార్యకలాపాలపై ఆరా తీశారు.
ఈ క్రమంలో కుప్పం రూరల్ సీఐ శ్రీ మల్లేష్ యాదవ్ గారు మాట్లాడుతూ... అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news