ఓబులవారిపల్లి పంచాయతీ కటికం వారి పల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు, యువ నాయకుడు కటికం నాగేంద్ర సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. పేదలకు అండగా నిలుస్తూ, యువతకు భరోసా కల్పిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతున్నారని చెప్పారు.
కటికం నాగేంద్ర పేద కుటుంబాలను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. కూడు, గూడు లేని నిరుపేదలకు జీవనాధారం కల్పించేందుకు తనవంతు సహకారం అందించడంతో పాటు మండలంలోని పలు ప్రాంతాల్లో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సేవ చేయడం ఆయన ప్రత్యేకతగా గ్రామ ప్రజలు అభివర్ణించారు.
యువత సమస్యలపై స్పందిస్తూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్నారని, అవసరమైన సమయంలో తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతున్నారని స్థానిక యువత పేర్కొంది. ప్రజా సేవను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న నాగేంద్రకు జనసేనలో మరింత ప్రాధాన్యం కల్పిస్తే రాష్ట్ర స్థాయిలో సేవలను విస్తరించే అవకాశం ఉంటుందని గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు.
క్రమంగా ప్రజల్లో గుర్తింపు పెంచుకుంటున్న కటికం నాగేంద్రకు రాబోయే సంస్థ ఎన్నికల్లో గ్రామాల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. యువతతో సన్నిహితంగా ఉంటూ పేదలకు అండగా నిలుస్తున్న ఆయన సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news